బాన్సువాడ రూరల్/ బీర్కూర్/ నస్రుల్లాబాద్/ రాజంపేట్/ బీబీపేట్/ భిక్కనూరు/ గాంధారి/ నిజాంసాగర్/ నాగిరెడ్డిపేట్/ పిట్లం, డిసెంబర్ 5: రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించలన్నారు. ప్రపంచ మృతిక దినోత్సవాన్ని సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశాలను ఏర్పాటు చేసి భూసారాన్ని రక్షించుకునే పద్ధతులను వివరించారు.
బాన్సువాడ మండలంలోని బోర్లం క్లస్టర్ పరిధిలో ఉన్న తాడ్కోల్ గ్రామ రైతువేదిక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. భూముల్లో సారం పెరగాలంటే రైతులు రసాయనిక మందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ సాగుపై దృష్టి సారించాలన్నారు. రైతులు పంటలు సాగు చేసే ముందు తప్పని సరిగా భూసార పరీక్షలు చేయించాలని సూచించారు. ఏడీఏ వినయ్‌కుమార్, ఏఈవో గోపాల్, బుడ్మి సొసైటీ మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, నాయకులు కుమ్మరి రాజు, లక్ష్మాగౌడ్, వెంకట్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
బీర్కూర్ మండలకేంద్రంలోని రైతువేదిక భవనంలో వ్యవసాయశాఖ అధికారులు నిర్వహించిన కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ద్రోణవల్లి అశోక్, గ్రామ అధ్యక్షుడు అవారి గంగారాం, ఎంపీపీ రఘు, సొసైటీ చైర్మన్ గాంధీ, ఏవో శ్రావణ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్‌లోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ సాయిలు యాదవ్, ఏఈవో దత్తేశ్వరి, సర్పంచ్ సాయిలు, మాజీ ఎంపీటీసీ మల్లేశ్, నాయకులు మైశాగౌడ్, బాబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజంపేటలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
గ్రామ కన్వీనర్ శ్రీరాం సురేశ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకుడు దుబ్బని శ్రీకాంత్, మండల కో-ఆప్షన్ మెంబర్ అహ్మద్అలీ, రైతుబంధు సమితి మం డల కన్వీనర్ శ్రీనివాస్, గ్రామ కన్వీనర్ కామిశెట్టి భాస్కర్, పీఏసీఎస్ డైరెక్టర్ బస్వయ్య, రైతులు సిద్ధిరాములు, ఈశ్వర్, నవీన్, శంకర్, సత్తయ్య, బలరాం, పరమేశం, వ్యవసాయాధికారిణి జోత్స్న ప్రియదర్శిని, రైతులు, ఏఈవో శ్రీకాంత్ పాల్గొన్నారు. బీబీపేట్‌లోని రైతు వేదికలో ఏఈవో రాఘవేంద్ర, రైతు బంధు సమితి మండల కన్వీనర్ నాగరాజ్‌గౌడ్, గ్రామ కన్వీనర్ సత్తయ్య, సర్పంచ్ లక్ష్మీసత్యనారాయణ, ఎంపీటీసీ కొరివి నీరజానర్సింహులు, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఆసిఫ్, రైతులు పాల్గొన్నారు.
భిక్కనూర్‌లోని రైతువేదికలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రపంచ మృత్తిక(నేల) దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీపీ గాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంత్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాంచం ద్రం, మాజీ సర్పంచ్ నాగభూషణంగౌడ్, సింగిల్ విండో చైర్మన్లు భూమయ్య, భూమారెడ్డి, రాజాగౌడ్, వైస్ చైర్మన్ ముచ్చర్ల రాజిరెడ్డి, ఏడీఏ(డీఏవో) ఆసిఫ్, లక్ష్మీప్రసన్న, ఏఈవో వినోద్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు.
గాంధారిలోని రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏడీఏ రత్న మాట్లాడుతూ.. భూసార పరిరక్షణ, జీవన ఎరువుల వినియోగం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్, ఎంపీటీసీలు పత్తి శ్రీనివాస్, తూర్పు రాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తఫా, ఏఈవో నిఖిత తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్, జుక్కల్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఉన్న రైతు వేదికల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. జుక్కల్ మండల కేంద్రంలో ఏవో నవీన్‌కుమార్, నిజాంసాగర్ మండలం మగ్దుంపూర్‌లో ఏఈవో గ్రీష్మ, మహ్మద్‌నగర్‌లో ఏఈవో మధు, వొడ్డెపల్లిలో ఏఈవో రేణుక నేల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో జుక్కల్ సర్పంచ్ రాములు, ఏఎంసీ చైర్మన్ సాయాగౌడ్, సొసైటీ చైర్మన్ శివానంద్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలంలోని మీసన్‌పల్లి, ఆజామాబాద్, బ్రాహ్మణ్‌పల్లి గ్రామాల్లోని రైతు వేదికల్లో ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని నిర్వహించారు.నాగిరెడ్డిపేట్ మండలంలోని ఆత్మకూర్, గోపాల్పేట్, మాల్తుమ్మెద క్లస్టర్ల పరిధిలోని రైతువేదికల్లో ఏవో విజయశేఖర్ సంబంధిత ఏఈవోలతో కలిసి రైతులకు మృత్తికపై అవగాహన కల్పించారు. ఎంపీపీ రాజదాస్, జడ్పీటీసీ సభ్యుడు మనోహర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఏఈవోలు దివ్య, బబిత, విగ్నేశ్ పాల్గొన్నారు. పిట్లం మండలంలోని తిమ్మానగర్, రాంపూర్, చిన్న కొడప్గల్ రైతు వేదికల్లో వ్యవసాయాధికారులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి భూసారాన్ని రక్షించుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. మండల వ్యవసాయశాఖ అధికారి కిషన్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, విండో చైర్మన్లు సాయిరెడ్డి, శపథంరెడ్డి, నాయకుడు విజయ్, సర్పంచులు పండిత్రావు, అనితా పండరి, ఏఈవోలు పాల్గొన్నారు.