రామారెడ్డి(సదాశివనగర్), సెప్టెంబర్ 24: విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శెకెల్లి రాజు(40) బుధవారం తన వ్యవసాయ పొలంలోని బోరు మోటరు పక్కన గడ్డిని యంత్రం సహాయంతో కట్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో విద్యుత్ తీగ తెగి గడ్డి కోసే యంత్రానికి తగిలింది. దీంతో అతడికి షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.