నస్రుల్లాబాద్, జూలై 9: విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందిన ఘటన బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (45) అనే రైతు గురువారం గ్రామ శివారులోని తన పొలానికి నీళ్లు పారించడానికి వెళ్లాడు. బోరు వేయడానికి వెళ్లే క్రమంలో పొలం గట్టు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ప్రమాదవశాత్తు చేయి తగలడంతో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు.
అక్కడే ఉన్న ఓ గొర్రెల కాపరి చూసి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.