Nizamabad | కంటేశ్వర్, సెప్టెంబర్ 12 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రపంచ ప్రఖ్యాత క్లాత్ బ్రాండ్ అయినటువంటి స్నిచ్ షోరూంను శుక్రవారం ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం వెంకటేశ్వర గ్రూప్ చైర్మన్ నల్ల మహిపాల్ రెడ్డి రిబ్బన్ కట్చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా దినదినంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి అనుగుణంగా పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్స్ అందుబాటులో ఉండడం సంతోషకరం అన్నారు. ప్రముఖ స్నిచ్ బ్రాండ్ ని నిజామాబాద్ ప్రజలు అధరించాలని కోరారు.