నిజామాబాద్ క్రైం,జనవరి 10: వాహనదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 25వ తేదీ వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీని ఈ నెల 10వ తేదీ వరకు చెల్లించుకునే అవకాశం కల్పించిన విషయం తెల్సిందే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా మంది వాహనదారులు పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించారు.
కాగా సాంకేతిక సమస్యతో కొందరు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి అవకాశం ఇస్తూ ఈ నెల 31వ తేదీ వరకు రాయితీతో కూడిన పెండింగ్ చలాన్లను చెల్లించాలని సూచించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు.