Devunipalli Mallanna Jatara | కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ ఉత్సవాలను ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గూడెల్లి గంగారం అన్నారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వెల్లడించారు. ప్రతీ సంవత్సరం మల్లికార్జున స్వామి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.
ఈ నెల 13న మైలపోలు కార్యక్రమం. 14వ తేదీన గ్రామదేవతలకు కొబ్బరికాయలు కొట్టుట, 15వ తేదీ ఉదయం 6 గంటలకు అగ్ని గుండాలు 10 గంటలకు అఖండ దీపారాధన, గణపతి గౌరీ పూజ, స్వస్తి పుణ్యాహవచనం, 11గం.లకు మల్లికార్జునస్వామి కళ్యాణం. 16న ఉదయం 8గంటలకు బోనాల ఊరేగింపు, ఒడిబియ్యం సాయంత్రం నాలుగు గంటలకు ఎడ్లబండ్ల ప్రదర్శన, 17న ఉదయం చక్రతీర్థం. మధ్యాహ్నం 12గం.లకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.
అదే రోజు సాయంత్రం మల్లికార్జున స్వామి నాగవెళ్లి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దేవునిపల్లి మల్లన్న జాతర పేరు పొందింది. ప్రతీ ఏటా సట్టిలో ఈ జాతర జరుగుతుంది. మండలంలోని అన్ని గ్రామాల నుండి భక్తులు దేవునిపల్లి మల్లన్నను పూజిస్తారు. ఈ మల్లికార్జున స్వామి ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు: హాజరవుతారని తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు ఆహ్వానం పలికారు.