కోటగిరి : ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోటగిరి ( Kotagiri ) సంజీవని హాస్పిటల్ డాక్టర్ ఇంతియాజ్ బేగం అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం అభయ హస్తం సొసైటీ ( Abaya Hastam) సహకారంతో కోటగిరి సంజీవని హాస్పిటల్ ( Sanjeevani Hospital ) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం (Medical Camp) నిర్వహించారు.
ఈ సందర్భంగా 350 మందికి ఆరోగ్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ వైద్యురాలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రతిరోజు యోగ, వాకింగ్ చేయాలన్నారు. తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బర్ల మధు, ప్రభాకర్, అవులయ్య, కన్నం సాయిలు, విజయ్, తదితరులు ఉన్నారు.