పోతంగల్ : నిజామాబాద్ జిల్లా పోతంగల్ ( Pothangal ) మండలంలోని కారెగామ్ గ్రామంలో సంజీవని హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ ప్లస్ ఫార్మసీ, మెడికల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. సంజీవని హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ఇంతియాజ్ బేగం (Doctor Imtiaz Begum) మాట్లాడుతూ శిబిరంలో 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు వివరించారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మితంగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం (Excercise), నడక (Walking) లాంటివి ప్రతిరోజు చేయాలని అన్నారు. ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుందని ఆమె పేర్కొన్నారు. దీంతో పాటు పరిశుభ్రత కూడా ఎంతో అవసరమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి క్యాకప్ప, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.