రామారెడ్డి, మే 29: ప్రభుత్వం జీలుగ, పెద్ద జనుము విత్తనాల బస్తాలను తక్కువ సంఖ్యలో సరఫరా చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సదాశివనగర్ మండలంలో మొత్తం 7వేల మంది రైతులు వరి సాగు చేస్తున్నారు. వీరందరికీ జీలుగ, పెద్ద జనుము విత్తనాలు అవసరముండగా బుధవారం పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు. తీరా చూస్తే జీలుగ 987, జనుము 300 బస్తాలు మాత్రమే రావడంతో కొందరికే లభించాయి. ఉదయం 6గంటలకు వచ్చినా విత్తనాలు దొరకలేదని పలువురు రైతులు నిరాశగా వెనుదిరిగారు. మండల వ్యవసాయాధికారి ప్రజాప్రతిని వివరణ కోరగా రైతులకు ఆన్లైన్ పద్ధతిలో విత్తనాలు అందజేస్తున్నామని, మరిన్ని బస్తాల కోసం ప్రభుత్వానికి ఇండెంట్ పంపించామని, మలివిడుతలో వస్తే రైతులకు అందజేస్తామని తెలిపారు.