ఖలీల్‌వాడి, జూన్ 12: నిజామాబాద్ నుంచి వరంగల్ మార్గంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో కొత్తగా డీలక్స్ బస్సు సౌకర్యం కల్పించినట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రాంతీయ అధికారి జానీరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ నుంచి ఉదయం 6.00, 6.45, 7.30, 8.00, 8.30, 9.00, మధ్యాహ్నం 1.00, 1.45, 2.30, 3.00, 3.30, 4.00 గంటలకు వరంగల్‌వైపు వెళ్తాయని పేర్కొన్నారు. వరంగల్ నుంచి నిజామాబాద్‌కు ఉదయం 6.00, 6.45, 7.30, 8.00, 8.30, 9.00, మధ్యాహ్నం 1.00, 1.45, 2.30, 3.00, 3.30, 4.00 గంటలకు బయల్దేరుతాయని తెలిపారు. గురువారం నుంచి సర్వీసులను ప్రారంభించనున్నామని, ప్రయాణికులు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.