Nizamabad | పోతంగల్, జూలై14: గుర్తు తెలియని ఆకతాయిలు పాఠశాల గదుల తాళాలు పగలగొట్టి సీలింగ్ ప్యాన్లు, వాటర్ బోర్ కేబుల్స్, ట్యూబ్ లైట్లు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మండలంలోని జల్లాపల్లి ఫారం ఉర్దూ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయికుమార్ కథనం ప్రకారం.. రెండో శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవులు ఉండడంతో తిరిగి సోమవారం పాఠశాల తెరిచాం. లోపలికి వెళ్లి చూసేసరికి పాఠశాలలోని ఓ గది తాళాలను గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టారు.
గదిలోకి చొరబడి సీలింగ్ ప్యాన్లు, వాటర్ బోర్ కేబుల్స్, ట్యూబ్ లైట్లు, విలువైన స్వీచ్ బోర్డ్లు, సర్వీస్ వైర్ ధ్వంసం చేశారు. దీంతో వాటర్ బోర్ పని చేయక విద్యార్థులు ఇబ్బందులు పడిన పరిస్థితి ఏర్పడింది. పోకిరీలు ఇలా తరుచుగా ఇలాంటీ సంఘటనలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.