రెంజల్, డిసెంబర్ 2 : మండలకేంద్రంలోని వృద్ధులకు ప్రతి నెలా రావాల్సిన పెన్షన్ ఇంకా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గత నెలలో అందాల్సిన పింఛన్ కోసం మూడు నాలుగు రోజులుగా పోస్టాఫీస్ చుట్టూ తిరిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన వృద్ధులు.
స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం అరగంటకుపైగా బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యను అధికారులకు విన్నవించుకుందామంటే కార్యాలయానికి ఎవరూ రాకపోవడంతో అసంతృప్తితో వెనుదిరిగారు.