మోర్తాడ్, నవంబర్ 30: గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల సర్పంచుల అధ్యక్షతన మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ ఇంకుడుగుంత నిర్మించుకునే విధంగా చూడాలని, కామన్ సోక్ పీట్లను నిర్మించాలని సూచించారు. భూగర్భ జలాలు పెంచుకొని భవిష్యత్తులో నీటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
బషీరాబాద్‌లో..
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో సర్పంచ్ సక్కారం అశోక్ అధ్యక్షతన జలశక్తి అభియాన్‌పై గ్రామసభ నిర్వహించారు. నీటి నిలువపై అధికారులు రైతులు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ విక్రమ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు పోశన్న, గణేశ్, సాగర్, శ్యామ్, రమేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
తడ్పాకల్లో..
మండలంలోని తడ్పాకల్ గ్రామంలో సర్పంచ్ పత్తిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఎంపీడీవో కర్నె రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకుడు గుంతలను నిర్మించుకొని భూగర్భ జలాల పెంపునకు కృషిచేయాలని సూచించారు. రైతులు పంట పొలాల చుట్టూ కందకాలు తవ్వించుకోవాలన్నారు. ఉపసర్పంచ్ లోలపు అశోక్, కార్యదర్శి శ్రీకాంత్, ఏఎన్ఎం వీణ, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.