Donate computers | కామారెడ్డి రూరల్, జనవరి 2 : ఇంటెల్ సహకారంతో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న మల్లారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలకు ఆరు కంప్యూటర్లను ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ బాలికలకు భవిష్యత్లో మంచి ఇంజనీర్లుగా రాణించడానికి ఆరు నెలలపాటు ఉచితంగా ఏఐ టూల్స్, సాంకేతిక రంగంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
అలాగే విద్యారంగంలో రాణించడానికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీ మాట్లాడుతూ బాలికలందరూ ఉన్నత చదువులు చదువుకొని రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఉపసర్పంచ్ కమ్మరి స్వప్న, చుక్కాపూర్ దేవస్థానం డైరెక్టర్ మాజీ సర్పంచ్ శ్రీ రామా గౌడ్, మాజీ సర్పంచ్ ఆనంద్ రావు, వివిధ ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు, ఆదర్శ పూర్వ కమిటీ విద్యార్థులు పాల్గొన్నారు.