Duty meet | విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికే డ్యూటీ మీట్.. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికే డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో జోన్ 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య ప్రారంభించారు.
- ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెంచేందుకే ఈ ఎంపిక పరీక్షలని సీపీ వెల్లడి
Duty meet | వినాయక నగర్, జులై 2: విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికే డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో జోన్ 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర రెండో డ్యూటీ మీట్ లో భాగంగా బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, అదిలాబాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ విధినిర్వహణలో సామర్థ్యం కమిషనరేట్ కార్యాలయంలో డిపార్ట్మెంట్ లో పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సీఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వేస్టిగేషన్ స్థాయిలు మెరుగుపడుతుందని సీపీ పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యాక్రమానికి పంపిస్తామని సీపీ పేర్కొన్నారు. పనిలో పోటీతత్వం అలవాటు పడుతుందని, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫారంసిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వేస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటులో నేరాలు జరిగినప్పుడు అట్టి నేరస్థలంలో సేకరించాల్సిన నేర సమాచారం కోసం పోలీస్ ఏ విధంగా సేకరించాలనే అంశం పై ఎంపిక పరీక్షలు నిర్వహించారు.
ఇందులో భాగంగా పోలీస్ హెడ్కార్టర్స్ గ్రౌండ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం, పోలీస్ కార్యాలయంలో సైంటి ఫిక్ ఎయిడ్స్ టూ ఇన్వెస్టగేషన్, కంప్యూటర్స్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, ఎక్స్ ఫ్లోజింగ్, నార్కోటిక్, ఫింగర్ ప్రింట్స్, పొరెన్సిక్ మెడిసిన్, తదితర అంశాల కోసం ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలు మూడు రోజులపాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యాక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రామ్ చందర్ రావ్, సీసీఎస్ ఏసీపీ నాగవేంద్ర చారీ, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్ సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

