బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలోని ప్రతి డివిజన్లో స్థానిక క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలను గుర్తించి అందులో క్రీడా మైదానాలు ఏర్పాటుచేసి, క్రీడా పరికరాలను అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక వీటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. 17వ డివిజన్లోని గౌతంనగర్‌లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం నిర్వహణ కరువై అధ్వానంగా మారింది. మైదానంలోనే వాటర్ ట్యాంక్ ఉండడంతో ఓవర్‌ఫ్లో నీటితో మైదానమంతా బురదమయంగా మారుతుంది. గడ్డి మొలిచి మురికి కూపంగా మారింది. ఇప్పటికైనా పాలకులు స్పందించి క్రీడా ప్రాంగణంలో అన్ని సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్

Nizamabad4