దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో దుర్గామాత విగ్రహాలను ఆదివారం చెరువుల్లో నిమజ్జనం చేశారు. వివిధ మండపాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో అమ్మవారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు.
భాజా భజంత్రీలు, భజనలు, యువకుల నృత్యాల మధ్య శోభాయాత్ర కొనసాగింది. అనంతరం స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు.