రాష్ట్రంలో రైతే రాజు అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దండిగా నీళ్లు, కరెంట్ అందుబాటులోకి రావడంతో పడావు భూములు పచ్చబడ్డాయన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పోయి అన్నదాతలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చెప్పారు. తెలంగాణ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ప్రాజెక్టులు నిర్మించారని, ఫలితంగా తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన స్పీకర్ పోచారం.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. చందూర్ ఎత్తిపోతలపథకంలో భాగంగా నిర్మించనున్న పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, జాకోరా ఎత్తిపోతలపనులను పరిశీలించారు.
– చందూర్, మే 8
చందూర్, మే 8: రాష్ట్రంలో రైతే రాజు అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దండిగా నీళ్లు, కరెంట్ అందుబాటులోకి రావడంతో పడా వు భూములు పచ్చబడ్డాయన్నారు. జాకోర, చందూర్, చింతకుంట లిఫ్ట్ పనులను జూన్‌లోపు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. సోమవారం ఆయన చందూర్ మండల కేంద్రంలో ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నీళ్లు ఉంటే లక్ష్మి ఉంటుందన్నారు. మన రాష్ట్ర రైతులకు ప్రభుత్వం నీళ్లు, కరెంట్ అందిస్తుండడంతో బంగారు పంటలు పండిస్తున్నారని అన్నా రు. అన్నదాత ఏ పంట పండించినా పది మందికి పంచుతాడే కానీ, తానొక్కడే తినడని అన్నారు. కోటీశ్వరుడైనా రైతు పండించిన అన్నం తినాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని, ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అన్నారు.
వర్షపు నీరు వృథా పోకుండా డ్యాము లు నిర్మించి సాగుకు అందిస్తే కరువు ఉండదన్నారు. ఆలోచన కలిగిన వ్యక్తులే నాయకులవుతున్నారని, అలాంటి వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడం మనకు గర్వకారణమన్నారు. మల్లన్న సాగర్ నుంచి హల్దివాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రావడంతో రైతులు పంటలు పండిస్తున్నారని అన్నా రు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఏడాదంతా నిండుకుండను తలపిస్తోందన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం 1.50 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయన్నారు. జాకోర , చందూర్, చింతకుంట ఎత్తి పోతల పథకంతో 10 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. పథకం నిర్మాణంలో భాగంగా 26 కిలో మీటర్ల పైప్ లైన్ పను లు సాగుతున్నాయన్నారు. రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీటీసీ గుత్ప విజయ భాస్కర్ రెడ్డి, ఎంపీపీలు లావణ్యారాంరెడ్డి, పిట్ల ఉమా శ్రీరాములు, తహసీల్దార్ వసంత, ఎంపీడీవో నీలావతి, ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
పైప్‌లైన్ పనులు వేగవంతం చేయండి
వర్ని, మే 8: జాకోర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వర్ని మండలం జాకోర గ్రామం వద్ద కొనసాగుతున్న ఎత్తి పోతల పథకం నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ప్రస్తుతం పంటలు కోసి నారు మడి వేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. నారుమడులు వేసే లోగానే పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో పనులు చేపట్టినప్పుడు రైతులను సంప్రదించాలన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ విఠల్, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్‌రావు, ఎస్ఈ వాసంతి, డిప్యూటీ ఈఈ శ్రావణ్ కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, బీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, కొర్వ గణేశ్, విష్ణు, హన్మాండ్లు తదితరులు ఉన్నారు.