ఉగ్ర భానుడు
ఉమ్మడి జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మండే సూర్యుడికి జనం అల్లాడుతున్నారు. ఇంటా, బయట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా శరీరంలో వేడిగానే ఉంటున్నది. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.
- మండుతున్న ఎండలు
- మధ్యాహ్నం 12దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యం
- అధిక ఉష్ణోగ్రతలతో జనం అవస్థలు
- వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యలు
కామారెడ్డి, ఏప్రిల్ 18 : ఉమ్మడి జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మండే సూర్యుడికి జనం అల్లాడుతున్నారు. ఇంటా, బయట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా శరీరంలో వేడిగానే ఉంటున్నది. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం 12 దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సుమారు 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతున్నది. కామారెడ్డి జిల్లా ఏరియా దవాఖానలో ప్రతిరోజూ తలనొప్పి, విరేచనాల సమస్యలతో 10 నుంచి 15 మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. సాధ్యమైనంత వరకు 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండదెబ్బ నుంచి రక్షణ ఇలా..
వేసవిలో ముఖ్యంగా శరీరంలో ప్లూయిడ్ లెవల్స్ పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఫ్లూయిడ్ లెవల్స్ తగ్గితే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఎక్కువ మోతాదులో నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. గంటకు 2,3 గ్లాసుల నీరు తీసుకోవాలి. పుచ్చకాయ రసం, బార్లీ జావలో పటికబెల్లం, కొబ్బరి నీళ్లు తాగాలి. మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం, తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలను తీసుకోవాలి. అలాగే ఆల్కహాల్, కాఫీ వంటి పానీయాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా పిల్లల విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు
పాటించాలి.
ఎండలో వెళ్లినప్పుడు చేయకూడనివి..
- వేసవిలో నలుపు, మందమైన దస్తులు ధరించొద్దు.
- ఎండ, వేడిగాలి తగలకుండా చూసుకోవాలి.
- అతి శీతల పానియాలు, మంచు ముక్కలు వంటివి తీసుకోవద్దు.
- ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉండాలి.
బయటికి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- తెల్లని,పలుచని దుస్తులు,కాటన్ దుస్తులు ధరించాలి.
- ఎండలో నుంచి ఇంటికి రాగానే తీపి పదార్థాలు తీసుకోకూడదు.
- ఎండలో తప్పనిసరిగా వెళ్తే తలపై టోపీ,లేదా రుమాలు ధరించాలి.
- ఓఆర్ఎస్ కలిపిన నీటిని ఎక్కువగా తాగాలి.
జాగ్రత్తలు పాటించాలి..
ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలకు 2,3 గ్లాసుల నీళ్లు, పెద్దవారు రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలి. వడదెబ్బ తగిలితే వెంటనే దవాఖానలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించాలి. ఉప్పు కలిపిన నీరు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పుచ్చకాయ రసం, మజ్జిగను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
-డా.శ్రీనివాస్, పిల్లల వైద్య నిపుణులు
వడదెబ్బకు కారణాలు…
- నీరు తక్కువగా తాగడం.
- మత్తు పానియాలు ఎక్కువగా తీసుకోవడం.
- ఎండలో ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా తిరగడం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- వడదెబ్బ తగిలిన వారిని చల్లటి ప్రదేశంలో ఉంచాలి.
- తడి బట్టతో శరీరమంతా తుడవాలి.
- శరీర ఉష్ణోగ్రత 36 డిగ్రీలు వచ్చే వరకు చల్లబరుస్తూనే ఉండాలి.
- వడదెబ్బ తగిలిన వారి శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి రాకపోతే వెంటనే దగ్గరలోని దవాఖానకు తరలించాలి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

