Nizamabad | పోతంగల్, జూన్ 15 : మండలంలోని జల్లాపల్లి ఫారం కు చెందిన డాక్టరేట్ గ్లోబల్ ఐకాన్ ఎక్స లెన్స్ అవార్డు గ్రహీత యం ఎ హకీమ్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసించారు. ఫ్రెండ్షిప్ మినిస్టరిస్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ నెల 9న హైదరాబాద్ లోని హిమాయత్ నగర్లో డాక్టరేట్ గ్లోబల్ ఐకాన్ ఎక్స లెన్స్-2025 అవార్డును ఎంఎ హకీంకు అందించారు.
కాగా మండలంలోని జల్లాపల్లి ఫారం లో ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు ఆదివారం అభినందన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్రెండ్ షిప్ మినిస్టర్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విల్సన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మట్లాడుతూ ఆయన చేసిన సేవలను గుర్తించి డాక్టరేట్ గ్లోబల్ ఐకాన్ ఎక్స లెన్స్ అవార్డు రావడం అభినందనీయమని కొనియాడారు.
భవిష్యత్తులో హకీమ్ సమాజానికి మరెన్నో విలువైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏజాజ్ ఖాన్, కోటగిరి మాజీ ఎంపీటీసీ సలీం, అబ్దుల్లా, శంకర్, దేవిసింగ్, మాజీ సర్పంచ్ గౌతమ్, రాములు తదితరులు పాల్గొన్నారు.