లింగంపేట, జూన్ 30: పోడు భూములకు పట్టాలు పొందిన గిరిజనులు తమ భూములను అమ్ముకోవద్దని.. పంటలు సాగు చేసి అభివృద్ధి చెందాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని మాలోత్ సంగ్యానాయక్తండాలో పోడు భూముల గిరిజనులకు శుక్రవారం పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని తెలిపారు. గిరిజనులకు పరిపాలనా సౌలభ్యం కల్పించాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను పంచాయతీలుగా మార్చి పాలించుకునే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. సమైక్యపాలనలో విద్యుత్, తాగునీటి సమస్యల తీవ్రంగా ఉండేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెకాల్సి వచ్చేదన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారి సంక్షేమానికి కృషి చేయలేదన్నారు. గతంలో అటవీ భూములు సాగు చేస్తే ఆ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవారని గుర్తుచేశారు. పోడు పట్టాలు అందించడంతో బాధలు తప్పాయన్నారు. గతంలో మాలోత్ సంగ్యానాయక్ తండా కు రైతుబందు పథకం కింద కేవలం రూ. 7 లక్షలు మా త్రమే వచ్చేవని, నేడు పోడు పట్టాల పంపిణీతో రూ.16లక్షలకు పెరిగిందని తెలిపారు. తండాలో 12 9 మందికి 170 ఎకరాలకు సంబంధించి పట్టాలు పంపిణి చేసినట్లు వివరించారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంతమందికి పట్టాలు రాలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందిస్తామని చెప్పారు.
బీజేపీ,కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మవద్దు
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్, బీజేపీ నాయకులు వచ్చి కల్లిబొల్లి మాటలు చెబుతారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు.దేశంలోని 20 రాష్ర్టాల్లో కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నాయని, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అక్కడ లేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వస్తే పథకాలు రద్దు చేస్తామంటున్నారని అన్నారు. ఎంపీపీ గరీబున్నీసా బేగం, జడ్పీటీసీ ఏలేటి శ్రీలత, గాంధారి జడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ రాధా బలరాం, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్, మాలోత్ సంగ్యానాయక్ తండా సర్పంచ్ బన్ని, ఎంపీటీసీ సామ్‌ని, రైతుబంధు సమితి మండల కన్వీనర్ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాజయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సర్వన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి అట్టెం శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఏ ఎంసీ చైర్మన్ కాశీ నారాయణ, నాయకులు నయీం, సంతోష్‌రెడ్డి, సాయిలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఏండ్ల కల నెరవేరింది..
ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరింది. పట్టాలు వస్తాయని మేము అనుకోలేదు. సీఎం కేసీఆర్ సార్ మా బాధను ఇబ్బందులను అర్థం చేసుకొని పట్టాలు అందించారు.
-కొర్ర సక్కుని, మాలోత్ సంగ్యానాయక్ తండా
చాలా ఆనందంగా ఉంది..
సమైక్యపాలనలో మాకు పట్టాలు ఇవ్వకుండా తిరస్కరించారు. సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్య పరిష్కరించనున్నట్లు ప్రకటించిన వెంటనే అధికారులు తం డాలో పర్యటించారు. పం టల సాగు, విస్తీర్ణం వివరాలు సేకరించి ప ట్టాలు అందించారు. చాలా ఆనందంగా ఉంది.
-కోర్ర సక్రి, మాలోత్ సంగ్యానాయక్ తండా