పెద్ద కొడప్గల్ : కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని విఠల్వాడి తండా (Vittalwadi Thanda) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు విట్టల్వాడి తండా నివాసి మదన్ సింగ్ పిల్లలు ఆడుకునే జారుడుబల్లను ( Skate board ) వితరణ చేశారు. హైదరాబాదులో నివాసం అంటూ తన సొంత తండాలో పిల్లలు విద్యపై ఆసక్తి కలిగేందుకు పిల్లలు ఆడుకునే జారుడుబల్లను అందజేసినట్లు మదన్‌సింగ్ (Madan Singh) పేర్కొన్నారు.
ఆటలు పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. చిన్నారులు ఇంటి దగ్గర ఉండకుండా పాఠశాలల్లో తోటి పిల్లలతో ఆడుకునేందుకు తప్పకుండా బడికి వస్తారని అన్నారు. పిల్లలకు చదువుతోపాటు ఆటలు కూడా చాలా ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా మదన్ సింగ్‌ను ఉపాధ్యాయులు, తండావాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తండావాసులు శ్రావణ్, దీప్తి చంద్, నాందేవ్, తదితరులు పాల్గొన్నారు.
,