nizamabad | మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు గురువారం సన్న బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. నిరుపేదలందరూ సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ షాపుల ద్వారా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతల బుచ్చిరెడ్డి, పొన్నాల గోపాల్ రెడ్డి, కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగారం రాజలింగం, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ కురుమ చంద్రం, సోషల్ మీడియా కన్వీనర్ గుండెల్లి యుగంధర్, గడ్డం నర్సింలు, మోత్కు రవి, బట్ట చిన్న దేవయ్య, గుండెల్లి దేవరాజ్, సురేష్ గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మోతే గ్రామంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న బీజేపీ నాయకులు
మోతే గ్రామంలో..
లింగంపేట : మండలం మోతే గ్రామంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం భాగంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 5 కిలోల సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో బిజెపి మాజీ మండల అధ్యక్షుడు మాసుల శ్రీనివాస్ బీజేవైఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శి కుమ్మరి శ్రీకాంత్, వడ్ల స్రవిన్ కుమార్, రేషన్ డీలర్ గంగారెడ్డి, సుధాకర్ రెడ్డి, సాయి రెడ్డి, గంగారెడ్డి, కృష్ణ ప్రసాద్, ఇషాక్, చాకలి చంద్రయ్య, బిజెపి పార్టీ నాయకులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.