బాల్కొండ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే 88 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లతో(Exam pads) పాటు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మంగళవారం ప్రారంభించారు. పదో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుల ఆధ్వర్యలో పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పదిలో సాధించిన మార్కులు ఉన్నత విద్యకు ఎంతో దోహదపడు తాయ న్నారు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.