నవీపేట,డిసెంబర్ 24: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది బాధితులకు మంజూరైన రూ.4.31 లక్షల సీఎంఆర్ చెక్కులను శనివారం ఎంపీపీ సంగెం శ్రీనివాస్ శనివారం పంపిణీ చేశారు. ఎంపీపీ సంగెం మాట్లాడుతూ ఎమ్మేల్యే మహ్మద్ షకీల్ చొరవ తీసుకోని 11 మంది బాధితులకు రూ.4.31 లక్షల చెక్కులను అందజేసినట్లు చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ డాంగే సతీశ్, బీఆర్ఎస్ నాయకులు గైని సతీశ్, నవీన్‌రాజ్, శంకర్ నాయక్, సంజీవ్‌కుమార్,ఆయా గ్రామాలకు చెందిన బాధితులు పాల్గొన్నారు.