బాల్కొండ(ముప్కాల్), డిసెంబర్ 9: మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 14 మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.6,67,500 ఆర్థిక సాయం మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ బాల్కొండ నియోజక వర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి వెంకటేశ్, లింగాగౌడ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, బాల్‌రాజ్, శ్రీకాంత్ చారి, ఎంపీటీసీ రాంరాజ్గౌడ్ పాల్గొన్నారు.
మాక్లూర్ మండలంలో..
మండలంలోని మదన్‌పల్లి, కల్లెడి గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను సర్పంచ్, టీఆర్ఎస్ నాయకులు గురువారం అందజేశారు. మదన్‌పల్లిలో సర్పంచ్ శంకర్‌గౌడ్, కల్లెడిలో టీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు చెక్కులను పంపపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఒడ్డెన్న, ఉప సర్పంచులు మహేశ్, మణిగౌడ్, నాయకులు రమేశ్, వినోద్, స్వామి తదితరులు పాల్గొన్నారు.