పోతంగల్ అక్టోబర్ 21: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హెగ్డోలి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ (ఎన్ఎఫ్ఎస్, ఎన్ఎం) లో భాగంగా యాసంగి పంట కోసం సబ్సిడీపై శనగ ఎన్ బిఈజీ 47 వెరైటీ విత్తనాలు పంపిణీ ప్రారంభించారు.
సబ్సిడీపై రైతుకు 2500 రూ. ధర కలిగిన 25 కేజీల బ్యాగ్ జీవన ఎరువులతో పాటు 1800 రూ. లభిస్తుందని తెలిపారు. మండలానికి 644 ఎకరాలకు సరిపడా 161 క్వింటాల్ విత్తనలు వచ్చాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏంఎంసీ చైర్మన్ హన్మంతు, స్థానిక నాయకులు పుప్పాల శంకర్, మండల వ్యవసాయ అధికారి నిషిత, రైతులు తదితరులు ఉన్నారు.