కంఠేశ్వర్ : రాజకీయ గురువులు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ( Dinesh Kulachari) మోసం చేశాడని పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్( Shekar goud) , మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ( Muppa Gangareddy) , డిచ్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృత్ పూర్ గంగాధర్ ఆరోపించారు.
రూరల్ క్యాంప్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నో అవకతవకలకు పాల్పడ్డ దినేష్ ను రెండేళ్ల తరువాత రెన్యువల్ చేయకుండా బాజిరెడ్డి ఆపివేశారని గుర్తు చేశారు. రాజకీయ ఓనమాలు నేర్పిన మండవ వెంకటేశ్వరరావును, ఏఎంసీ పదవి కట్టబెట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ లను మోసం చేశారని అన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాత్రం 20 ఏళ్లు ఉద్యమంలో పనిచేశారని అన్నారు. ఎమ్మెల్సీ పదవిని సైతం తునప్రయంగా వదలిపెట్టిన గొప్ప నాయకులు భూపతి రెడ్డి ప్రశంసించారు. ఉద్యమంలో ఆస్తులు అమ్ముకుని సేవ చేశారని అలాంటి గొప్ప ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని అన్నారు. బీజేపీ నాయకులు మాత్రం సమాజంలో మత కల్లోలాలు సృష్టిచేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గతంలో జడ్పీటీసీ గా గెలిచి సొంత గ్రామానికి ఏం చేశావని ప్రశ్నించారు. వయసుకు మించి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. దాదాపు రూ. 300 కోట్లతో రూరల్ నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో శంఖుస్థాపనలు జరిగాయని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, డిచ్పల్లి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, భోజన్న, శాంసన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజలింగం, ముల్లంగి గంగారెడ్డి, యువజన నాయకుడు ఏశాల మహేందర్, సంతోష్ రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.