డిచ్పల్లి/ కోటగిరి/ధర్పల్లి/ రుద్రూర్/ ఇందల్వాయి/ బాల్కొండ/ భీమ్‌గల్/ శక్కర్‌నగర్/నవీపేట/ ఆర్మూర్, బాల్కొండ/ ఎడపల్లి/ ఏర్గట్ల/ ముప్కాల్, డిసెంబర్ 30: మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో బైరి నరేశ్ అనే ్యక్తి హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడడంపై అయ్యప్ప మాలధారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో శువ్రారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పలు చోట్ల బైరి నరేశ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై డిచ్పల్లి మండలకేంద్రంలో అయ్యప్ప మాలధారులు ధర్నా నిర్వహించారు. అనంతరం డిచ్పల్లి పోలీస్‌స్టేషన్‌లో బైరి నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
కోటగిరి మండలకేంద్రంలో అయ్యప్ప మాలధారులు, హిందువులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై రెండు గంటల పాటు బైఠాయించారు. రుద్రూర్ సీఐ జాన్‌రెడ్డి, ఆర్ఐ సయ్యద్ హుస్సేన్ ఘటనా స్థలానికి సుముదాయించారు.
ధర్పల్లి మండలంలోని గాంధీచౌక్ వద్ద, రుద్రూర్ మండల కేంద్రంలో అయ్యప్ప మాలధారులు, భక్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అయ్యప్ప మాలధారులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనందరం ఎస్సై నరేశ్‌కు వినతిపత్రం అందజేశారు.
బాల్కొండ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో నిర్వహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
భీమ్‌గల్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు.
బోధన్ అయ్యప్ప సేవా ట్రస్ట్ ప్రతినిధులు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. సీఐ ప్రేమ్‌కుమార్‌కు ఫిర్యాదు అందచేశారు.
నవీపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎస్సై రాజారెడ్డికి ఫిర్యాదు చేశారు.
అఖిల భారత దీక్ష ప్రచార సమితి, ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి నాయకులు ఆర్మూర్ పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ర్యాలీగా పోలీసుస్టేషన్‌కు చేరుకొని బైరి నరేశ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలో వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములురాస్తా రోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించి ఎస్‌స్సై రాజశేఖర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని మంగళ్‌పాడ్ చౌరస్తాలో అయ్యప్ప స్వాములు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బైరి నరేశ్‌పై ఫిర్యాదు చేశారు.
ఏర్గట్ల మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మాలధారుల సమావేశంలో మాల ధారుడు జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్ మాట్లాడారు. అయ్యప్ప స్వామిపై నాస్తికుడు బైరి నరేశ్ అనుచితంగా మాట్లాడడం సబబు కాదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బైరి నరేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అయ్యప్ప భక్తులు, భజరంగ్ దళ్ సభ్యులు ముప్కాల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సై సురేశ్‌కు ఫిర్యాదు చేశారు. ముప్కాల్, మెండోరా మండలాల అయ్యప్ప మాలధారులు, భక్తులు, భజరంగ్ దళ్ సభ్యులు పలు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.