ఎల్లారెడ్డి రూరల్, మే 5: ధాన్యం కొను గోలు చేయడంలేదని అన్నదాతలు ఆందో ళన చేపట్టారు. మూడు రోజులుగా అన్నా సాగర్ గేట్ వద్ద ఉన్న కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని, వెంటనే ప్రారం భించాలని కోరుతూ ఎల్లారెడ్డి-బాన్సువాడ ప్రధాన రహదారిపై మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ప్రారంభమైందని, ఇప్పటివరకు నాలుగు లారీల ధాన్యం మాత్రమే తరలించారని తెలిపారు.
ఆదివారం నుంచి హమాలీలు రాకపోవడంతో కాంటా చేయడం పూర్తిగా నిలిచిపోయిం దన్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కాంటా చేయడంలేదని మండి పడ్డారు. ధర్నా విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ రైతుల వద్దకు చేరుకున్నారు. హమాలీలను వెంటనే పిలిపించి తూకం ప్రారంభిస్తానని భరోసా ఇవ్వ డంతో రైతులు ధర్నా విరమించారు. ఆందోళనలో అన్నా సాగర్ గ్రామ మాజీ సర్పంచ్ పెరుగు నాగరాజు, రైతులు వెంకట్‌రెడ్డి, దుర్గారెడ్డి, రాజుయాదవ్, హరినాథ్‌రెడ్డి, భానుగౌడ్, పేశెట్టి రాజు, అంజయ్య పాల్గొన్నారు.