ఆర్మూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాలల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రమేష్ (Deputy DMHO Ramesh ) అన్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్ పెట్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC) అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ కీర్తన, ఏఎన్ఎంలు, తదితరులు ఉన్నారు.