ఎల్లారెడ్డి రూరల్, నవంబర్ 17 : సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ప్రతి మధ్యాహ్న భోజన కార్మికుడికి రూ. 10 వేల వేతనం కల్పించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ జిల్లా అధ్యక్షురాలు సోఫియా డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులతో కలిసి ఆమె పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యా హ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని చేపట్టినట్లు చెప్పారు.
మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలు జిల్లాకు సంబంధించిన రూ. 8 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికీ 25 రూపాయల స్లాబ్‌రేట్, నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లు, గ్యాస్‌ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలన్నారు. ప్రతి కార్మికుడికీ ఇన్సూరెన్స్‌తోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు హేమలత, సంగీత, బద్యానాయక్, విమల, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.