వృక్షశాస్త్రం విభాగంలో దీపక్‌కు డాక్టరేట్
టీయూ వృక్షశాస్త్రం విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి దీపక్ డాక్టరేట్‌ను అందుకున్నారు.
డిచ్పల్లి, నవంబర్ 28 : టీయూ వృక్షశాస్త్రం విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి దీపక్ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఆచార్య బి.విద్యావర్ధిని పర్యవేక్షణలో ‘ఎఫెక్ట్ ఆఫ్ బ్రాసినొస్టీరైడ్స్ ఆన్ గ్రోత్ అండ్ ఈల్డ్ ఆఫ్ ప్లంబాగో జైలానికా’ అంశంపై దీపక్ పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. సోమవారం నిర్వహించిన వైవా కార్యక్రమానికి తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ఆచార్య సావిత్రమ్మ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు.
దీపక్ పరిశోధన ఫలితాలపై సంతృప్తి చెంది డాక్టరేట్ పట్టాను అందజేశారు. దీపక్‌ను వీసీ రవీందర్ గుప్తా అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, వృక్షశాస్త్రం విభాగాధిపతి బి.విద్యావర్ధిని, సైన్స్ డీన్ ఎం.అరుణ, బీవోఎస్ చైర్పర్సన్ డాక్టర్ హలీమ్ ఖాన్, డాక్టర్ దేవరాజ్, శ్రీనివాస్, డాక్టర్ వి.జలంధర్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

