రెంజల్ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి నదిలో (Godavari river) మృతదేహం లభ్యమైందని రెంజల్ పోలీసులు (Renjal Police) తెలిపారు. బుధవారం మాఘ పౌర్ణమి (Pournami) సందర్భంగా కోటగిరి మండల కేంద్రానికి చెందిన సాయిబాబా (35) తన తాత మాక్కయ్య తో కలిసి పుణ్య స్నానాలు ఆచరించేందుకు గోదావరి పుష్కర ఘాట్‌కు (Puskara Ghat) చేరుకున్నారు.
నదిలో దిగిన సాయి బాబా ప్రమాదవశాత్తు నదిలో జారిపడి గల్లంతయ్యాడు. తాత మాక్కయ్య పోలీసులకు సమాచారం అందించడంతో రెంజల్ పోలీసులు అదృశ్య కింద కేసు నమోదు చేశారు. గురువారం తెల్లవారు జామున సాయిబాబా మృతదేహం నీటి పైకి తేలడంతో దానిని ఒడ్డుకు చేర్చారు. భార్య సుష్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.