కోటగిరి, జనవరి 6 : దళితుల సంక్షేమం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. వర్ని మండలం పాత వర్నిలో రూ. 10 లక్షలతో నిర్మించ తలపెట్టిన ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమిపూజ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని దళితులందరూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేశారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, సర్పంచులు ఎంబడి పద్మా నాగభూషణం, శ్రీనగర్ రాజు, బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, కులకర్ణి సంతోష్ పాల్గొన్నారు.
వర్ని మండల కేంద్రంలోని సహకార బ్యాంకును డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. బ్యాంకులో దీర్ఘకాలి క, స్వల్పకాలిక రుణాల వివరాలను బ్యాంకు మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలను త్వరగా వసూలుచేయాలని సూచించారు. బ్యాంకులో ఫ్లోరింగ్ ధ్వంసమైంద ని, మరమ్మతులు అవసరమని మేనేజర్.. డీసీసీసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట సహకార సంఘాల అధ్యక్షులు కృష్ణారెడ్డి, కనకారెడ్డి, నాయకులు అంబర్‌సింగ్, మాధవరెడ్డి తదితరులు ఉన్నారు.