శరీరానికి సరిపడినంత పోషకాహారం తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలను వివరించడమే లక్ష్యంగా జాతీయ పోషకాహారం సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ హేమలత ప్రత్యేక కాన్సెప్ట్‌ను రూపొందించారు. ఆరోగ్యకరమైన పద్ధతులను ప్రోత్సహించడంతో పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు సాయపడుతుందంటారు. ఇటీవల కాలంలో న్యూట్రిషన్ ఫుడ్ కోసం ఆన్లైన్లో వెదకడం, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని బలంగా నమ్మి మోసపోతున్నారు. దీంతో సప్లిమెంట్ల వినియోగం కూడా భారీగా పెరుగుతున్నది. ఇలాంటి వాటిని నియంత్రించేలా ఈ విధానాన్ని డెవలప్ చేసినట్లుగా జాతీయ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పోషకాహారంపై ఉన్న ఎన్నో అపోహలకు చెక్ పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మై ప్లేట్ ఫర్ ద డే జాబితా ప్రకారం ధాన్యాలు 240 గ్రాములు, కొవ్వు 27గ్రాములు, గింజలు 30 గ్రాములు, పప్పులు, మాంసం 90 గ్రాములు, కూరగాయలు, ఆకుకూరలు 350 గ్రాములు, పండ్లు 150 గ్రాముల చొప్పున తీసుకోవడంతో శరీరానికి అవసరమైన 2వేల కేలరీలతోపాటు ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు సూక్ష్మపోషకాలు, విటమిన్లు సమృద్ధిగా అందుతాయని వివరించారు. మాంసం తినని వారు ఎక్కువగా పప్పులను తీసుకోవడంతో కండరాల వృద్ధికి అవసరమైన మాంసకృత్తులు అందుతాయని పేర్కొన్నారు. వీటిని క్రమంగా తీసుకోవడంతో మైక్రో న్యూట్రియంట్ల కొరత కూడా తీరుతుందని వివరించారు.
విస్తృతంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పోషకాహారాన్ని ఎంపిక చేసుకోవడం క్లిష్టంగా మారింది. అయితే సరైన ఆహారానికి నిర్ధిష్టమైన ప్రమాణాలు లేకపోవడంతో అవసరానికి మించిన కేలరీలు శరీరంలోకి చేరుతున్నాయి. లేదంటే అసలు పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించి మెరుగైన ఆరోగ్యాన్నిచ్చే మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ జాబితాను తయారుచేశారు. దీని ప్రకారం నిత్యం శరీరానికి అవసరమైన 2000 కేలరీలను ధాన్యాలు, పప్పులు, పాలు, ఆకుకూరలు, పండ్లు, గింజలతో కలిపి తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నది. అదేవిధంగా పోషకాలను పొందేందుకు చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటారని, దీని ద్వారా శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి తగ్గిపోవడం, అజీర్తి, డయాబెటిస్ వంటి ఇతర రుగ్మతల బారిన పడుతున్నారని నిపుణులు తేల్చారు. అమైనో ఆమ్లాలు, కొవ్వులు, ఖనిజాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఇతర బయోయాక్టివ్ పదార్థాల అవసరాన్ని తీర్చేలా సరైన నిష్పత్తిలో ఆహార నమూనాలను సూచించారు. అయితే సమతుల్యమైన ఆహారంలోనే అన్ని పోషకాలు అందుతాయని, దీనికి ప్రత్యేకంగా ఎలాంటి మినరల్ సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.
ధాన్యాలు : బార్లీ, మక్కజొన్న, మిల్లెట్లు, ఓట్స్, వరి, జొన్నలు, గోధుమలు,
పప్పులు : శనగలు, మినుములు, ఆలుసందలు, పల్లీలు, పెసర్లు, ఉలవలు, కందులు, మైసూర్, చిక్కుడు
గింజలు : బాదం, కాజు, పొద్దుతిరుగుడు, ప్లాక్స్, పిస్తా, నువ్వులు, లోటస్ సీడ్,
పండ్లు : యాపిల్, దానిమ్మ, పైనాపిల్, జామ, అరటి, స్ట్రాబెర్రీ, బొప్పాయి
మాక్లూర్, సెప్టెంబర్ 20: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని రైతులు చేపల పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఖర్చుతో కూడినదైనప్పటికీ ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలు ఉండడంతో రైతులు చేపల చెరువులపై మొగ్గు చూపుతున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ఇది ఎంతో లాభాదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. మాక్లూర్ మండలం మాదాపూర్‌లో బొంతల శేఖర్‌రావు, ముల్లంగి(బీ)లో బూరోల్ల ఆశన్న, బొంకన్‌పల్లిలో బెండ గంగాధర్ (బాషా) అనే రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో చేపల చెరువులను ఏర్పాటు చేశారు. అర ఎకరం పొలంలో వానకాలం, యాసంగి సీజన్లో వరి పండిస్తే ఖర్చులు పోనూ రూ.20వేలు మిగులుతాయని, అదే అర ఎకరంలో చేపల చెరువు ఏర్పాటు చేసుకొని 8 నుంచి10 నెలలు కష్టపడితే రూ.15లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు.
రూ.8లక్షలు ఖర్చులు పోనూ రూ.7లక్షలు మిగులుబాటు అవుతాయని తెలిపారు. 15 ఇంచుల పిల్లలను చెరువులో పెంచాలని, 10 నెలల తర్వాత కిలో సైజ్‌లో చేపలు చేతికందుతాయని, మార్కెట్లో డిమాండ్ మేరకు హోల్‌సేల్ లేదా రిటైల్‌గా చేపలను విక్రయించుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్లో నల్ల చేపలకు భలే డిమాండ్ ఉంటుంది. వారానికోసారి చెరువులోని నీటిని తీసివేసి మళ్లీ కొత్త నీటిని నింపాల్సి ఉంటుందని, మిగతా రోజులు బోరు నీటిని పంటలకు ఉపయోగించుకునే వీలు ఉంటుందన్నారు. అంతర పంటలా ఏడాది పాటు రెండు పంటలతో కలిపి చేపల పెంపకం కూడా చేసుకోవచ్చని, సమయం కూడా కలిసివస్తుందని చెబుతున్నారు. కొర్రమీను, నల్లమొట్ట చేపలను ప్రజలు తినేందుకు బాగా ఇష్టపడతారని, వాటికి డిమాండ్ బాగా ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.500-600 ఉంటుందని, ఇక్కడ కిలో రూ.350 నుంచి రూ.400 వస్తే మంచి లాభాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో చేపలను పెంచే రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. చేపల చెరువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని అందిస్తున్నారు.
చేపల పెంపకంతో ఆదాయం బాగుంటుంది. ఖర్చుకూడా ఎక్కు వే. కష్టపడితే మంచి ఫలితం ఉం టుంది. అర ఎకరంలో రెండు పంటలు వేసినా లక్ష కూడా మిగులవు. ఇక్కడ 8నెలలు కష్టపడితే లక్షల్లో ఆదాయం ఉంటుంది. పెట్టుబడికి భయపడొద్దు. 24గంటల విద్యుత్ సరఫరా ఉండడంతో చేపల పెంపకానికి బాగా కలిసి వస్తుంది. చేప పిల్లలు వేసిన నుంచి చాలా జాగ్రత్తగా ఉంటే, పది నెలల తర్వాత అద్భుతమైన ఫలితాలు చూస్తాం.
– బొంతల శేఖర్‌రావు, మాదాపూర్
వరిపంటలో అంతర్గత పంటగా చేపల చెరువులు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నది. తక్కువ నీటి సౌకర్యం ఉన్నా ఇబ్బంది ఉండదు. వారానికోసారి చేపల చెరువులో నీటిని తీసి కొత్త నీటిని నింపాలి. అర ఎకరం, ఎకరంలో పెంచుకోవాలి. వరి పంట, అరుతడి పంటలతోపాటు అంతర్గత పంటగా చేపలు పెంచవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిత్యం రెండుసార్లు దాణా వేస్తే సరిపోతుంది.
– బూరోల్ల ఆశన్న, ముల్లంగి (బీ)
చాలా ఏండ్లు గల్ఫ్ దేశం వెళ్లాను. ఇక్కడ కష్టపడితే ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. లక్షలు పెట్టి మోసపోవాల్సిన అవసరం లేదు. చేపల చెరువుల గురించి తెలుసుకొని సొంత పొలంలో సాగు ప్రారంభించాను. చేపల బరువు కిలో వరకు వచ్చాయి. త్వరలోనే అమ్మకాలు చేపడతాను. ఎకరం పొలంలో చేపలను పెంచాలనే ఆలోచన ఉన్నది. ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో వరితోపాటు చేపలను పెంచుతున్నాను.
– బెండ గంగాధర్(బాషా), బొంకన్పల్లి
రోజూ తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యం సొంతం అవుతుంది. ఏ ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనే దానిపై ఇప్పటికీ సాధారణ జనాలు అయోమయానికి గురవుతుంటారు. ఇక అందుబాటులో ఉన్న ఆన్లైన్ మాధ్యమాలతో సరైన ఆహారం ఏదీ అనే విషయం మరింత గందరగోళంగా మారుతుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌పెట్టేలా జాతీయ పోషకాహార సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నది. మంచి ఆహారంపై అవగాహన కల్పించడంతోపాటు, పోషకాహారం ఆవశ్యకతను వివరించేలా ప్రత్యేక జాబితాను సిద్ధం చేసింది.