బీబీపేట్, మార్చి 18:ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు బుధవారం బీఆర్ఎస్లోకి చేరారు. మాజీ ఎంపీపీ బాయికాడి బాలయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆది రాజయ్య, శివ్వోల పర్షారాములు, బాయికాడి రాకేశ్ తదితరులకు పార్టీలో చేరగా, గంప గోవర్ధన్ వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఎన్నికల ముందర ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా పబ్బం గుడుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై విరక్తితో ఆయా నాయకులు అధికార పార్టీని వీడారని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్ తెలిపారు. సింగిల్ విండో మాజీ చైర్మన్ ఎంబరి గంగాధర్, నాయకులు నాగరాజ్, చంద్రం, నందకుమార్, మహంకాళి, పర్షరాములు పాల్గొన్నారు.