బాన్సువాడ , ఏప్రిల్ 13: రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజక వర్గ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను మరిచిపోయిందని మండిపడ్డారు. ఆదివారం ఆయన బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
రైతురుణమాఫీ ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. ప్రశ్నిస్తే ద్రోహులుగా చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు అన్ని గమనిస్తున్నారని, రానున్నరోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తమకు అధికారం మాత్రమే పోయిందని, ప్రజల గుండెల్లో అభిమానం పోలేదన్నారు.
కోటగిరి, పొతంగల్ మండలాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన బోనస్ డబ్బులను రైతుల పేరిట సొసైటీ కార్యదర్శులతోపాటు కొందరు కాజేశారని, దీనిపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్రాజ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రైతుల బోనస్ డబ్సులను కాజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. వెంటనే బోనస్ డబ్బులను కాజేసిన వారి వివరాలను సేకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఆబ్కారీ శాఖ అధికారులపై చర్యలేవీ?
నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి, అంకోల్, అంకోల్తండా, దామరంచ గ్రామాల్లో ఇటీవల కల్తీకల్లు తాగి సుమారు వంద మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇంతజరిగినా స్థానిక ఎమ్మెల్యే పోచారం, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్రాజ్ ఎందుకు పట్టించుకోలేదన్నారు. బాధ్యులైన ఆ బ్కారీ శాఖ అధికారులను ఇప్పటివరకు ఎం దుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. వెం టనే చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు.
ఆబ్కారీ అధికారులు కేవలం కొంతమంది వ్య క్తులపైనే కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వా రిని ఉపేక్షించేది లేదని అన్నారు. గౌడన్నలు ప్రకృతి పరంగా వచ్చే స్వచ్ఛమైన కల్లును తయారు చేసి విక్రయించాలని, కృత్రిమ కల్లుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని కోరా రు. బీఆర్ఎస్ నాయకులు మోచి గణేశ్, ఎర్రవట్టి సాయిబాబా, రమేశ్ యాదవ్, శివసూరి, సంజీవ్ యాదవ్, ఆఫ్రోజ్, టేకుల సాయిలు, రజాక్, గోపాల్, మహేశ్ పాల్గొన్నారు.