కంటేశ్వర్ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండంలోని మైనార్జీ జూనియర్ కళాశాల (Minority Junior College) విద్యార్థులు సమస్యలపై గళమెత్తారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంత్‌కు ( Collector Hanmanth) ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు.
కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ కుమార్ రెడ్డి ( Lecturer Kumar reddy ) ప్రతి విషయానికి పెనాల్టీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించడం లేదని ప్రిన్సిపాల్ , స్టాఫ్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. అనారోగ్యం పేరుతో కెమిస్ట్రీ లెక్చరర్ కాలేజీకి సెలవు పెట్టి వెళ్లడంతో సిలబస్ పూర్తికాక పరీక్షల్లో ఫెయిలవుతామన్న భయంతో ఉన్నామని వెల్లడించారు.
తాము విన్నవించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఫిర్యాదులపై స్పందించిన కళాశాల ప్రిన్సిపల్ అర్షి ఇక్బాల్ మాట్లాడుతూ కళాశాలలో ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేవని, తనకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని అన్నా. ఏదైనా సమస్య ఉంటే కనుక్కొని పరిష్కరిస్తామని వెల్లడించారు.