లింగంపేట, ఏప్రిల్ 15: మండలంలోని అంబేద్కర్ సంఘం నాయకులు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్రకు మంగళవారం ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిశారు.
లింగం పేటలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడంతోపాటు అంబేద్కర్ సంఘం నాయకులతో దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ జయంతిని నిలిపివేయించిన సీఐపై చర్యలు తీసుకోవాలని కో రారు. స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంటనే కామారెడ్డి ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు.
ఘటనపై దర్యా ప్తు చేపట్టి దళితులను అవమాన పరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అంబేద్కర్ సం ఘం నాయకులు తెలిపారు. అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం, లింగంపేట మండల అధ్యక్షుడు నీరడి సంగమేశ్వర్, గౌరవ అధ్యక్షుడు ముదాం సా యిలు, మండల ఉపాధ్యక్షుడు ద్యా మని భూపతి, నాయకులు ఆశయ్య, రాజు, అల్లూరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.