భిక్కనూర్, జూలై 29 : రాజంపేట మండల కేంద్రంలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం విద్యాలయం ఆవరణలో మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతున్నదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల స్వరూప, జడ్పీటీసీ కొండ హన్మాండ్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్వంత్‌రావు, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ జూకంటి మోహన్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి అశోక్, సర్పంచ్ ఆముదాల స్యౌమ్య, నాగరాజు, మాజీ ఎంపీటీసీ రవి, నాయకులు తదితరులు పాల్గ్గొన్నారు.