కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కలెక్టర్ (Collector) ఆశిష్ సాంగ్వాన్ (Ashish Sangwan) గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల 173 వ పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటును వినియోగించుకున్నారని తెలిపారు. ఓటింగ్ సరళి, ఏర్పాట్లపై ప్రిసైడింగ్, సెక్టోరల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.