పోతంగల్ : నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన పోతంగల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు (Collector Rajiv Gandhi i) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని ఆయా విభాగాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
పీహెచ్ సీలోని హాజరు పట్టికను తెప్పించుకుని పరిశీలించారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు ( Inpatients ) , అవుట్ పేషెంట్లు (Outpatients ) ఎంత మంది వస్తున్నారు. మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. నిరంతరం వైద్యసేవలు అందుతున్నాయని రోగులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయన వెంట ఎమ్మార్వో గంగాధర్, మెడికల్ ఆఫీసర్ అలీముద్దీన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ రాధిక, తదితరులు ఉన్నారు.