కంఠేశ్వర్, అక్టోబర్ 28 : జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఇన్చార్జి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఇన్చార్జి డీపీవో శ్రీనివాస్, ఏసీపీ రాజావెంకట్రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
జిల్లావ్యాప్తంగా రెండు విద్యాసంస్థల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మంజూరు కాలేదని, గతంలో స్వీకరించిన మైనార్టీ కార్పొరేషన్ లోన్ అప్లికేషన్లకు సంబంధించి లోన్లు వెంటనే మంజూరు చేయాలని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ కార్యకర్తలు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.