కంఠేశ్వర్, మార్చి 5: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం డిచ్పల్లిలోని సీఎంసీని అన్నివిధాలా సిద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. సీపీ కల్మేశ్వర్ సింగెనవార్, అదనపు కలెక్టర్లతో కలిసి సీఎంసీని మంగళవారం సందర్శించారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్‌ల కోసం అందుబాటులో ఉన్న గదులను పరిశీలించారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపును సీఎంసీలోనే చేపట్టినట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
సీఎంసీ భవన సముదాయంలోని గదులను శుభ్రం చేయించి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్‌ల కోసం సిద్ధం చేయాలన్నారు. ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ పనులను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు బాధ్యతలు పురమాయించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్, అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, మధుసూదన్, ఆర్అండ్బీ ఎస్ఈ హన్మంతురావు, ట్రాన్స్‌కో ఎస్ఈ రవీందర్, అటవీశాఖ అధికారి మురళీ మనోహర్‌రెడ్డి ఉన్నారు.