కామారెడ్డి, మే 11: ఈనెల 13న నిర్వహించే లోక్‌సభ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 6,80,921 ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 3,28,879 మంది, స్త్రీలు 3,52,012 మంది, 30 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 913 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 64 సమస్యాత్మక ప్రాంతాల్లో 183 పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి 1977 బ్యాలెట్ యూనిట్లు, 987 కంట్రోల్ యూనిట్లు, 1,107 వీవీ ప్యాట్లు, ఎన్నికల సామగ్రి, సిబ్బందిని 94రూట్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని వివరించారు. ఇప్పటివరకు రూ. కోటీ 92 లక్షల నగదు, రూ.15.85 లక్షల విలువగల 7,045 లీటర్ల మ ద్యం, రూ.16.50 లక్షల విలువగల గంజాయి, బంగారం పట్టుకొని కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. సీ-విజిల్, టోల్‌ఫ్రీ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. హోమ్ ఓటింగ్‌లో 419 మం ది సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు పాల్గొన్నారని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న 4,060 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు. 13న నిర్వహించే పోలింగ్‌కు ఎన్నికల సంఘం గుర్తించిన 12గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానితో వెళ్లి ఓటు హక్కు ను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు.
ఏర్పాట్ల పరిశీలన
లోక్‌సభ పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ శనివారం పరిశీలించారు. మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలోని ఈవీఎం స్ట్రాంగ్రూంతోపాటు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సలాబత్పూర్ చెక్‌పోస్టును సందర్శించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు.