కంఠేశ్వర్, సెప్టెంబర్ 1: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యుశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లకు సూచించారు. ఆదివారం డీజీపీ జితేందర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో వరద ప్రభావిత పరిస్థితులపై సమీక్షించారు.
మరో రెండురోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, ఎక్కడా ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడకూడా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. వీసీలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, పాల్గొన్నారు.