Bikkanoor | ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా భిక్కనూరులో బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
భిక్కనూరు, జూన్ 10 : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా భిక్కనూరులో బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. గ్రామస్థుల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించి వినతిపత్రాలు స్వీకరించారు. పూరిగుడిసెలను గుర్తించి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.
ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ అర్హులైన యువతను ఓటరు జాబితాలో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో జన సంరక్షణ–మన సంరక్షణ కార్యక్రమం కింద 36 వేల కందకాలు తవ్వినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారం, ఆయిల్పామ్ సాగు విస్తరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కల్పించి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ప్రయాణంలో హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఎల్ఎస్పీ నర్సింహారెడ్డి, అదనపు కలెక్టర్ ఎం.వి. గిరి, సర్పంచ్ రేఖ, జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

