Indonesia | ఇండొనేషియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి
ఇండొనేషియాలో శనివారం ఉదయం 7.7 రిక్టర్ స్కేల్ తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని వల్ల కనీసం 47 మంది చనిపోయారని, డజను మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
మౌమెరె: ఇండొనేషియాలో శనివారం ఉదయం 7.7 రిక్టర్ స్కేల్ తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని వల్ల కనీసం 47 మంది చనిపోయారని, డజను మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పలు భవనాలు, ఇండ్లు కూలిపోవడంతో భూకంప ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొన్నది. ఈస్ట్ నుస టెన్గ్గరా ప్రావిన్స్‌లోని సిటీ ఆఫ్ ఎండెకు వాయవ్య దిశలో 68 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతం కేంద్రంగా భూకంపం సంభవించిందని అమెరికా భౌగోళిక సర్వే తెలిపింది.
ఫ్లోర్స్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో ఇది ఏర్పడిందని వెల్లడించింది. కొన్ని ప్రకంపనల తర్వాత భూ కంపం సంభవించిందని..తీర ప్రాంతవాసులకు సునామీ హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత ఉపసంహరించినట్టు అధికారులు చెప్పారు. నగెకియో ప్రాంతంలో 2 వేల మంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భూకంపం కారణంగా ఎండె రెగెన్సీలో కొండ చరియలు విరిగి పడ్డాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

