మోర్తాడ్ : కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో ఆర్మూర్ రజనీకాంత్ కొన్ని రోజుల క్రితం అనా రోగ్యంతో బాధపడుతున్నాడు. వెన్నుపూస నరాలకు సంబంధించిన ఆపరేషన్ కావడంతో ఆయనకు మంజూరైన లక్ష రూపాయల సీఎంఆర్ ఎఫ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకట రవి మంగళవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ చెక్కులు మంజూరయ్యే అని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంలా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో గోపిడి లింగారెడ్డి రఫిక్ గ్రామ నాయకులు వెంకట్,గణేష్ మండల్ మండల శేఖర్, గంగాధర్, మల్కయ్య, సంజీవ్, మారుతి, రాజేశ్వర్, అశోక్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.